Avatar 2 Trailer : భారీగా అంచనాలు పెంచేస్తోన్న అవతార్‌-2.. కొత్త ట్రైలర్‌ చూశారా?

Avatar 2: The Way Of Water New Trailer Is Pure James Cameron - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా అవతార్‌-2. 9ఏళ్ల క్రితం వచ్చిన అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ భారీ అంచనాలు క్రియేట్‌ చేయగా తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్‌ ద్వారా హింట్‌ ఇచ్చారు డెరెక్టర్‌. ఇప్పటికే ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. మరి విడుదలకు ముందే వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో వేచి చూడాలి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top