
అల్లు అర్జున్
హైదరాబాద్ నుంచి గోవాకు షిఫ్ట్ కానున్నారు పుష్పరాజ్. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుందని సమాచారం. ఈ గోవా షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుందని తెలిసింది. సినిమాలోని ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా తొలి పార్ట్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.