 
													Is Aishwarya Rai Bachchan Pregnant For Second Time: అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది.

బెల్లీని చాలా వరకు దాచి ఉంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందనే రూమర్స్‌కి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
