మరో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీం | Aadavallu Meeku Joharlu Movie New Release Date Is March 4th | Sakshi
Sakshi News home page

Aadavallu Meeku Joharlu: మరో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీం

Feb 20 2022 8:01 AM | Updated on Feb 20 2022 8:04 AM

Aadavallu Meeku Joharlu Movie New Release Date Is March 4th - Sakshi

శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఒక వారం ఆలస్యంగా వస్తామంటూ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. మార్చి 4న విడుదల చేయాలనుకుంటున్నట్లు శనివారం చిత్ర నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ప్రకటించారు.

చదవండి: నోయల్‌తో విడాకుల తర్వాత రెట్టింపు సంతోషంగా ఉన్నా: హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ మేరకు చిత్రం బృందం  ‘‘సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మార్చి 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఇప్పటివరకూ విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అని పేర్కొంది. మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో సీనియర్‌ నటి ఖుష్బూ, రాధికా శరత్‌ కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement