
సాంకేతికతతో కేసుల పరిష్కారం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
చిలప్‌చెడ్(నర్సాపూర్)/కౌడిపల్లి/నర్సాపూర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం చిలప్‌చెడ్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై నిరంతరం అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. అలాగే కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఫిర్యాదులు అందగానే వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండాలని చెప్పారు. సీసీ కెమెరాలు బిగించి, సక్రమంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తూ ప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింహులు పాల్గొన్నారు.