● సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మార్గంలో నడపాలంటున్న ప్రయాణికులు
బెల్లంపల్లి: రైల్వే శాఖ ఆధునికీకరించిన నమో భారత్ ర్యాపిడ్ రైలుపై ప్రయాణికులు గొప్ప ఆశలు పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య ఈ రైలును నడపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో తయారైన ఈ రైలును రాష్ట్ర రాజధానిని ముఖ్య నగరాలతో అనుసంధానం చేయడానికి రూపొందింది.
ఆధునిక సౌకర్యాలు..
నమో భారత్ ర్యాపిడ్ రైలు, గంటకు 130 కి.మీ. వే గంతో 300–350 కి.మీ. దూరం ప్రయాణించే సా మర్థ్యం కలిగి ఉంది. 12–16 ఏసీ చైర్‌కార్లతో, ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక సౌచాలయాలు, చార్జింగ్ పోర్టులు, కవచ్ భద్రతా వ్యవస్థ వంటి సౌకర్యాలు ఈ రైలును ప్రత్యేకం చేస్తాయి. గుజరాత్, బీహా ర్‌లో ఇప్పటికే నడుస్తున్న ఈ రైలును తెలంగాణలో ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సిర్పూర్–హైదరాబాద్ మార్గంలో నడపాలని..
సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య భాగ్యనగర్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్ల మధ్య 7 గంటల వ్యవధి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది. నమో భారత్ రైలును ఈ రెండింటి మధ్యలో భాగ్యనగర్ తర్వాత నడిపితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, జనగాం, భువనగిరి వంటి స్టేషన్‌లలో హాల్టింగ్ కల్పించాలని కోరుతున్నారు.
పుష్కరకాలంగా నిరీక్షణ..
పుష్కర కాలంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైళ్లు తప్పా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో పట్టాలెక్కిన కొత్త రైలు లేదు. 90% మూడో రైల్వేలైన్ పూర్తయినా, కొత్త రైళ్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు గడ్డం వశీకృష్ణ, గొడెం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఈ రైలు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అన్ని ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే, రైల్వే ఆదాయంతోపాటు ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది.