
కుల గణన చరిత్రాత్మక నిర్ణయం
దండేపల్లి: దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మ కం అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. హర్షం వ్యక్తం చేస్తూ దండేపల్లి బీజేపీ కార్యాలయంలో గురువారం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఇదే మొ దటిసారి అన్నారు. గతంలో కేంద్రంలో అధి కారంలో ఉన్న ప్రభుత్వాలు కులగణపై ఆలో చన చేసినా ముందుకు సాగలేదని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం కులగణ నకు అంగీకరించడం హర్షణీయమని అన్నా రు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజయ్య, నాయకులు గురువయ్య, సురేందర్, నరేష్, సంతోష్, లక్ష్మణ్, శేఖర్, అశోక్, కిషన్, రవీందర్, రాకేష్, వెంకటేశ్వ ర్లు, మల్లేష్, గురువయ్య, మహేష్ పాల్గొన్నా రు.