సమస్యలు లేకుండా చూస్తాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు లేకుండా చూస్తాం

Published Fri, May 2 2025 1:19 AM | Last Updated on Fri, May 2 2025 1:19 AM

సమస్యలు లేకుండా చూస్తాం

సమస్యలు లేకుండా చూస్తాం

దండేపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా, కొనుగోళ్లు వేగవంతం చేయడంతోపాటు లోడింగ్‌, అన్‌లోడింగ్‌లో ఆలస్యం కాకుండా, గన్నీ సంచులు అందుబాటులో ఉంచేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండలంలోని ముత్యంపేట, నెల్కివెంకటాపూర్‌, దండేపల్లి, పాతమామిడిపల్లి, ధర్మరావ్‌పేట, వెల్గనూర్‌ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. బస్తాలను మిల్లులకు తీసుకెళ్లిన లారీలు అన్‌లోడ్‌ కాక రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు లారీలు రాక ఇక్కడే ఉండి పోతున్నాయని నిర్వాహకులు చెప్పారు. కలెక్టర్‌ వెంటనే సివిల్‌ సప్లయ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అన్‌లోడింగ్‌ ఆలస్యం కాకుండా చూడాలని, వీలయితే పక్క జిల్లాల మిల్లులకు ట్యాగింగ్‌ ఇచ్చి అక్కడికి పంపించాలని సూచించారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌లో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వెల్గనూర్‌ కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల సమస్య ఉందని, లారీలు కూడా సరిగా రావడం లేదని చెప్పడంతో.. సమస్యలన్నీ తీరుస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ వేగవంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కన్నెపల్లి రైస్‌మిల్‌ వద్దకు వెళ్లారు. ధాన్యం లోడ్‌తో నిలిచి ఉన్న లారీలను చూసి వెంటనే అన్‌లోడింగ్‌ చేయాలని సూచించారు. డీఆర్‌డీవో కిషన్‌, తహసీల్దార్‌ సంధ్యారాణి, ఆర్‌ఐ భూమన్న, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలి

మంచిర్యాలటౌన్‌: వేసవిలో విద్యతోపాటు కళలు, చిత్రలేఖనం, పెయింటింగ్‌ శిక్షణకు వేసవి శిక్షణ శి బిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్యతో కలిసి పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లాలో ని 50 పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని, 15 రోజులపాటు శిబిరాలు నిర్వహించాలని, ఒక్కో శిబిరానికి రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. ప్రతీ శిబిరంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ అందించాలని తెలిపారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కొనుగోలు కేంద్రాల సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement