
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, సెక్రెటరీ ఫణి, కోచ్‌లు ఎం.వనిత, రవికుమార్ తెలిపారు. వనపర్తిలో నిర్వహించిన 68వ ఎస్‌జీఎఫ్ ఫుట్‌బాల్ అండర్–14 పోటీల్లో ఉమ్మడి జిల్లా ద్వితీయస్థానం కై వసం చేసుకుంది. సిర్పూర్(టి) టీజీ ఎంఆర్‌ఎస్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ఏ. దీక్షిత, ఆసిఫాబాద్ టీజీ డబ్ల్యూఆర్‌జేసీలో ఎనిమిదో తరగతి చదువుతున్న భూమిక, కాగజ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అనిత మండల్‌తో పాటు, అండర 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అభిలాష్ ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకు మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.
కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన కిచక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మావల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న గుండి మహేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని షీటీంకు ఫిర్యాదు అందగా మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మంగళవారం సదరు టీచర్‌ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక యోగ టీచర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె ఫిర్యాదుతో మరో కేసు సైతం నమోదు చేసినట్లు తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక