
విహారయాత్రతో విషాదం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
కొత్తకోట రూరల్: ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాద ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న ఆ కుటుంబంలో విహారయాత్ర తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మృత్యువాత పడగా.. మరో తీవ్రంగా ఐదుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన సాయి దాబా నిర్వహకుడు రాజు తన ఇద్దరు సోదరుల కుటుంబాలకు చెందిన 18 మంది పెద్దలు, నలుగురు పిల్లలు కలిపి మొత్తం 22 మంది జూన్ 26వ తేదీన ఓ మినీ బస్సు, ఇన్నోవా కారులో విహారయాత్రకు బయల్దేరారు. రం రోజులు సంతోషంగా గడిపిన వారు బుధవారం ఉదయం తమిళనాడులోని భవానీమాతను దర్శించుకొని.. కొత్తకోటకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం తమిళనాడులోని సేలం సమీపంలో ధర్మపురి బైపాస్ వద్ద ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో.. దానికి వెనుకే వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన యుగంధర్‌రెడ్డి (50), మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సునితమ్మ (58) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు పెద్దవారితో పాటు నలుగురు పిల్లలున్నారు. గాయపడిన వారిలో పురుషోత్తమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
మృతులు వనపర్తి జిల్లా వాసులు
యాత్ర ముగించుకొని తిరిగి
వస్తుండగా ప్రమాదం

విహారయాత్రతో విషాదం

విహారయాత్రతో విషాదం

విహారయాత్రతో విషాదం