
భూమి బదులు భూమి ఇవ్వాలి..
మాకు అనంతవరం శివారులో ఉన్న మూడెకరాల భూమిని రిజర్వాయర్ కింద తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మేం అంగీకారం తెలపకపోయినా మా భూములు తీసుకుంటాం అంటున్నారు. మేం కోల్పోయే భూములకు బదులుగా మరో చోట భూమిని కేటాయించాలి. మా జీవనోపాధి కోల్పోకుండా చూడాలి.
– సుక్కమ్మ, మహిళా రైతు, బల్మూరు
కేవలం సర్వే పనులు చేపడుతున్నాం..
రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన సర్వే పనులను మాత్రమే చేపట్టాం. రైతుల భూములను స్వాధీనం చేసుకోలేదు. రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాల్లో మార్కింగ్ చేపడుతున్నాం. ప్రభుత్వం చట్టప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తుంది.
– బాలస్వామి,
డీఈ, నీటిపారుదల శాఖ
●