శిక్షణ.. సాధన | - | Sakshi
Sakshi News home page

శిక్షణ.. సాధన

Jun 6 2025 12:23 AM | Updated on Jun 6 2025 12:23 AM

శిక్ష

శిక్షణ.. సాధన

స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికకు..

స్పోర్ట్‌ స్కూల్‌లో ఎంపికకు వేసవి శిబిరంలో అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. సునీల్‌ సార్‌ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. పెద్దయ్యాక క్రీడల్లో రాణించాలని ఉంది.

– ప్రేమ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌

మొదటిసారి హాజరు..

హ్యాండ్‌బాల్‌ శిక్షణకు మొదటిసారి వచ్చాను. చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. రోజు మైదానానికి వచ్చి శిక్షణ తీసుకుంటా.

– సత్య అజిత్‌, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరులోని ప్రధాన స్టేడియానికి ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ స్టేడియం ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికై ంది. వేసవి వచ్చిందంటే చాలు ఈ స్టేడియంలో పలు రకాల క్రీడల్లో శిక్షణనిస్తారు. ఈ ఏడాది కూడా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో గత నెల 1వ తేదీన శిక్షణ శిబిరాలు ప్రారంభించగా.. జూన్‌ 6 (శుక్రజువారం)తో ముగి యనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా క్రీడాకారుల వివరాల నమోదుతో పాటు నామమాత్రపు ఫీజు వసూలు చేశారు. ఫుట్‌బాల్‌ శిక్షణకు రూ.300, హ్యాండ్‌బాల్‌కు రూ.100, అథ్లెటిక్స్‌కు రూ.400, వాలీబాల్‌కు రూ.100, బాస్కెట్‌బాల్‌కు రూ.400, ఆర్చరీకి రూ.200, చెస్‌కు రూ.300, బ్యాడ్మింటన్‌కు రూ.వెయ్యిగా నిర్ణయించారు. సుమారు 200కిపైగా విద్యార్థులు, యువత ప్రత్యేక శిక్షణకు హాజరయ్యారు. ఉదయం 6 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇచ్చారు. అలాగే కబడ్డీ, యోగా శిబిరాలు సైతం నిర్వహించారు.

ప్రతిభ చాటేందుకు..

వేసవి శిబిరాలు ప్రతిభ కనబర్చేందుకు వేదికలా ఉపయోగపడుతున్నాయి. గతంలో శిక్షణలో పాల్గొన్న చాలామంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను గుర్తించి వారికి నిరంతరం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు తమ చిన్నారులను వేసవి శిక్షణా శిబిరానికి పంపిస్తున్నారు.

పాలమూరు ప్రధాన స్టేడియంలో పలు క్రీడల్లో శిక్షణ

200కుపైగా విద్యార్థులు హాజరు

నేటితో ముగియనున్న శిబిరాలు

శిక్షణ.. సాధన 1
1/3

శిక్షణ.. సాధన

శిక్షణ.. సాధన 2
2/3

శిక్షణ.. సాధన

శిక్షణ.. సాధన 3
3/3

శిక్షణ.. సాధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement