నేటి నుంచి వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

May 9 2025 1:02 AM | Updated on May 9 2025 1:02 AM

నేటి నుంచి వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

నేటి నుంచి వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాలో ఆరు వేసవి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేటి (శుక్రవారం) నుంచి జూన్‌ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక పాలకవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని హెచ్‌సీఏ ఆమోదించినట్లు తెలిపారు. గ్రామీణ జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధే ధ్యేయంగా అన్ని క్రికెట్‌ సెంటర్లలో ఉదయం, సాయంత్రం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్‌–14, 16, 19, 23 బాలబాలికల విభాగాల్లో శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శిబిరాల్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో ఆరు సెంటర్లు

క్రికెట్‌ అసోసియేషన్‌

జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌

క్యాంపుల వివరాలు:

కాకతీయ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌: కోచ్‌ తోట రాము 99665 59414

మహబూబాబాద్‌, కాంక్రీట్‌ గ్రౌండ్‌ అజయసారథి 98664 79666

భూపాలపల్లి, సింగరేణి స్టేడియం శ్రీనివాస్‌ 88978 05683

పరకాల, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ అభినవ్‌వినయ్‌ 96662 06662

ములుగు, తంగేడు గ్రౌండ్‌ సందీప్‌నేత్ర 90301 30727

జనగామ, సెజ్‌ పాఠశాల గ్రౌండ్‌ దిలీప్‌రెడ్డి 99590 00003

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement