క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలి

Published Wed, Oct 11 2023 7:48 AM

-

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట మండలంలోని రెడ్యాల గిరిజన ఆశ్రమం పాఠశాలలో ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించే డివిజన్‌స్థాయి క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎర్రయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన కార్యాలయంలో మంగళవారం ప్రధానోపాధ్యాయులు, పీఈటీలతో నిర్వహించిన సమావేశంలో ఎర్రయ్య మాట్లాడారు. డివిజన్‌ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను ఈనెల 12వ తేదీన రెడ్యాలలో ఉదయం 9 గంటలకు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు హాజరుకావాలన్నారు. 14, 17సంవత్సరాల బాలబాలికలు డివిజన్‌ స్థాయిలో కబడ్డీ ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, చెస్‌, క్యారం, వివిధ క్రీడలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో కొత్తగూడ డివిజన్‌ కార్యదర్శి కొమ్మాలు, ఏఓ నాగసాగర్‌, ప్రధానోపాధ్యాయులు భారత్‌కిషన్‌ నాయక్‌, వెంకట్‌ రెడ్డి, పీఈటీలు మోహన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement