తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.81.03 లక్షలు
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా రూ.81.03 లక్షల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. బుధవారం అమ్మవారి హుండీల్లోని కానుకలను మండపంలో లెక్కించారు. 100 రోజులకు గాను ఆలయంలో మొత్తం హుండీల్లో నగదు రూపంలో రూ.81,03,052, బంగారం 57 గ్రాములు, వెండి 3 కిలోల 200 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే విదేశీ నగదు యూఎస్‌ఏ డాలర్లు 21, కెనడా డాలర్లు 5 వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. ఈఓతో పాటు చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు.
మోపిదేవి: మండలంలోని పెదకళ్లేపల్లి పీహెచ్‌సీ పరిధిలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు రెండు నమోదయినట్లు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ శ్రీరామ్ సాయి తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో జ్వరపీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఈ సర్వేలో ఇద్దరు అనుమానిత రోగులకు రక్తనమూనాలు సేకరించి, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి పంపించగా, పరీక్షల్లో వారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేడపురుగును పోలిన ఒరియెంటియా సుట్సుగముషి కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని వివరించారు. శరీరంపై నల్ల మచ్చ కనిపించి జ్వరం వచ్చినట్టయితే స్క్రబ్ టైఫస్ వ్యాధిగా నిర్ధారించొచ్చని తెలిపారు.


