ఏపీఐఐసీ భూముల పరిశీలన
జగ్గయ్యపేట: మండలంలోని జయంతిపురం, వేదాద్రి గ్రామాల్లో ఏపీఐఐసీ భూములను బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ స్థాపనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే భూములు పరిశీలించామన్నారు. కర్మాగారాలు ఏర్పాటు చేస్తే అనువైన భూములు, రోడ్డు సౌకర్యాలు, పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులు వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో భూ సామర్థ్యాన్ని నిర్థారించడానికి సాయిల్ టెస్టింగ్ కూడా నిర్వహిస్తామన్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సీఎండీ (బీడీఎల్) ఏ. మాధవరావు, జీఎం సత్యనారాయణ, ఎమ్మెల్యే రాజగోపాల్, ఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


