
ఆకట్టుకున్న గోదా కల్యాణం నృత్య రూపకం
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషాభిమానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకం ఆసాంతం ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం సందర్భంగా ఆముక్త మాల్యద కావ్యం నుంచి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, కేవీ సత్యనారాయణ రచించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని బుధవారం రాత్రి ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయలుగా కేవీ సత్యనారాయణ అభినయించారు. తొలుత కేవీ సత్యనారాయణను జస్టిస్ యు.దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు.