
జగిత్యాలలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 18వ స్టోర్‌ను సినీ నటి, యాంకర్ అనసూయ ప్రారంభించారు. ఆధునాతన కలెక్షన్స్‌తో నిత్యం నూతన వైరెటీలతో కాసం పేరుగాంచిందని తెలిపారు. జగిత్యాలలో ఈ స్టోర్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇది జగిత్యాల జిల్లావాసులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నిర్వాహకులు మల్లికార్జున్, కేదరినాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 18 స్టోర్‌లను ప్రారంభించామన్నారు.
షాపింగ్‌మాల్ ఎదుట సందడి
యాంకర్ అనసూయ జగిత్యాలకు రావడంతో షాపింగ్‌మాల్‌వద్ద సందడి నెలకొంది. అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో షాపింగ్ మాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఆటపాటలతో సందడి చేసిన అనసూయ

జగిత్యాలలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం