
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
కరీంనగర్: కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు పిల్లల్లో నలుగురికి 18ఏళ్లు నిండాయి. వీరితో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం కలెక్టరేట్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బాల బాలికలకు పీఎంకేర్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. 18ఏళ్లు నిండేసరికి రూ.10 లక్షలు వారిఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. సదరు పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని అన్నారు. కష్టపడి చదివి జీవితంలో నిలదొక్కుకోవాలని సూచించారు. ఏం చదువుకోవాలన్నా ప్రభుత్వసంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు బ్యాంకు పాస్‌బుక్, ఆరోగ్యకార్డులు అందజేశారు. అనంతరం పిల్లలతో కలిసి ఓ హోటల్‌లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీడబ్ల్యూవో సబిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
చొప్పదండి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని గుమ్లాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లనిర్మాణం పరిశీలించారు. లబ్ధిదారుతో మాట్లాడారు. బేస్‌మెంట్ పూర్తి చేసి మొదటి బిల్లు తీసుకోవాలని సూచించారు. గ్రామ శివారులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రాజగోపాల్, హౌజింగ్ ఏఈ సుప్రియ, మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి