
మంత్రి కారు ప్రమాద ఘటనలో ఇద్దరిపై కేసు● అతివేగం, నిర్లక
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం మారుతినగర్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కారు శనివారం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మంత్రి అడ్లూరి మెట్‌పల్లిలో పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తున్న సమయంలో కోరుట్ల వైపు నుంచి టోచన్‌తో వస్తున్న కారు మంత్రి ప్రయాణిస్తున్న కారు టైరుకు తగలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనకు కారకులైన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పాషా, ఇమ్రాన్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన నాగుల వేణు(35) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు. వేణు గతంలో గల్ఫ్ వెళ్లి అప్పుల పాలు కావడంతో తిరిగి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపంతో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముకాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరిశంకర్
కరీంనగర్‌టౌన్: మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చల్ల హరిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా అందించారు. హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. మున్నూరు కాపులను సంఘటిత పరచి ఒకే తాటిపైకి తీసుకువెళ్తానని తెలిపారు.

మంత్రి కారు ప్రమాద ఘటనలో ఇద్దరిపై కేసు● అతివేగం, నిర్లక

మంత్రి కారు ప్రమాద ఘటనలో ఇద్దరిపై కేసు● అతివేగం, నిర్లక