ఆర్చరీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చికిత | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చికిత

Jun 7 2025 12:07 AM | Updated on Jun 7 2025 12:07 AM

ఆర్చరీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చికిత

ఆర్చరీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చికిత

పెద్దపల్లిరూరల్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ పోటీల్లోభారతజట్టులో స్థానం సంపాదించుకున్న తానిపర్తి చికిత స్టేజీ–3 టోర్నమెంట్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో రాణించి క్వార్టర్‌ ఫైనల్స్‌ పోటీలకు అర్హత సాధించారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్‌ శుక్రవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికితకు ఆర్చరీపై ఉన్న ఆసక్తిని గుర్తించి అప్పటి కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ.. క్రీడా పరికరాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు. హరియాణా రాష్ట్రంలోని సోనిపట్‌లో పొందే శిక్షణకు కలెక్టర్‌ చొరవతో ఎన్టీపీసీ యజమాన్యం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న చికిత.. ప్రతిభను కనబర్చి పలు పతకాలను దక్కించుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌ ఆర్చరీ పోటీల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్టు ప్రపంచకప్‌ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement