
వ్యాధులు వచ్చే ప్రమాదం
ఒకప్పుడు అందరం విస్తరాకులు వాడేవాళ్లం. ఇప్పుడు ఏ వేడుకలోనైనా ప్లాస్టిక్ప్లేట్లు వినియోగిస్తున్నారు. వీటితో అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంతలో ప్లాస్టిక్ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులకు దూరంగా ఉండడం మంచిది. ప్లాస్టిక్‌తో ఉన్న అనర్థాలను గుర్తించి ఇప్పటికై నా స్టీల్‌ప్లేట్లను వాడుతూ..అనారోగ్యాలకు దూరంగా ఉండాలి.
– సత్యనారాయణస్వామి, ఎల్లారెడ్డిపేట
వేసవిలో చేతినిండా పని..
ఎండాకాలం వచ్చిందంటే చేతి నిండా పని ఉండేది. ఇంటిల్లిపాదిమి అడవికి పోయి మోదుగాకులు తెంపుకొచ్చేవాళ్లం. మ ళ్లీ ఇంటి వద్ద అందరం కలిసి వి స్తరాకులు కుట్టేవాళ్లం. ఎవరైనా పండుగ చేసుకుంటే మా దగ్గరికే వచ్చి కొనుక్కొని పోయేటోళ్లు. కానీ ఇప్పుడందరూ ప్లాస్టిక్ప్లేట్లే కొంటున్నారు. విస్తరాకుల కోసం ఎవరూ రావడం లేదు. ఇంటి వరకే విస్తర్లను తయారు చేసుకుంటున్నాము.
– మోతె భారతమ్మ, నారాయణపూర్
ఒకప్పుడు ఉపాధి ఉండేది
గతంలో మారుమూల తండాల్లో నివసించే గిరిజనులం మోదుకు విస్తర్లు తయారు చేసి అమ్ముకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వాళ్లం. మార్కెట్లోకి ప్లాస్టిక్ప్లేట్లు రావడంతో ఉపాధి కోల్పోయాం. మాతరం వారంతా ఇప్పటికీ మోదుకు విస్తర్లనే కుట్టుకుంటున్నాం. ఇంట్లో జరిగే శుభకార్యాలకు మోదుగు విస్తర్లనే వాడుతున్నాం. బయట మాత్రం మోదుగు విస్తర్లు కనిపించడం లేదు.
– భూక్య పీక్లీ, గుంటపల్లిచెరువు తండా

వ్యాధులు వచ్చే ప్రమాదం

వ్యాధులు వచ్చే ప్రమాదం