ఉన్నత లక్ష్యంతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యంతో చదవాలి

Jun 29 2025 2:47 AM | Updated on Jun 29 2025 2:47 AM

ఉన్నత

ఉన్నత లక్ష్యంతో చదవాలి

కేజీబీవీలో విద్యార్థినులతో

కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

లింగాలఘణపురం: విద్యార్థినులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా కోరారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల, మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, దుస్తులు, నోట్‌బుక్స్‌ అందాయా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గదుల శుభ్రత, వంటగదిలో ఆహార పదార్థాల నాణ్యత, మరుగుదొడ్లలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంఈఓ విష్ణుమూర్తి, ఎంపీఓ రఘురామకృష్ణ, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సునీత, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.

గోదావరి జలాలతో

చెరువులు నింపాలి

జనగామ రూరల్‌: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య అధ్యక్షతన శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, మాచర్ల సారయ్య, రామావత్‌ మీట్యా నాయక్‌, నక్క యాకయ్య, పయ్యావుల భిక్షపతి, ఉర్సుల కుమార్‌, బండ కింది బాలనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్‌లో చేరడం గొప్ప అవకాశం

జనగామ రూరల్‌: చదువును మధ్యలో నిలిపివేసిన వారు చదువుకోవడానికి ఓపెన్‌ స్కూల్‌లో చేరడం గొప్ప అవకాశమని అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ లైసన్‌ ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌లో సెర్ఫ్‌ జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వయోజన విద్యా విభాగం, విద్యాశాఖ, టాస్‌ సంయుక్తంగా చేపడుతున్న ఉల్లాస్‌, టాస్‌ కార్యక్రమం గురించి కోఆర్డినేటర్‌ శంకర్‌రావు వివరించారు. చదువురాని వారిని, చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారి చదువుకొనసాగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఓపెన్‌ స్కూల్‌ ఒక వరం లాంటిదన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ వసంత, అడిషనల్‌ డీఆర్‌డీఓ నూరోద్దీన్‌, డీపీఓ రాజేంద్ర ప్రసాద్‌, ఏపీఓ జ్యోతి, సీఎంఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌

ఎంపికలు

జనగామ రూరల్‌: పట్టణంలోని మినీ స్టేడియం ధర్మకంచలో జిల్లా స్థాయి 10, 12, 14 సంవత్సరాల బాలబాలికల ట్రయాతలిన్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు శనివారం జరిగాయి. ఈ ఎంపికలకు 500 మంది విద్యార్థులు వివిధ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనగా 25 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూలై 6న జేఎన్‌ఎస్‌ హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా అసోసియేషన్‌ కోశాధికారి ఆవుల అశోక్‌, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గోర్‌ సింగ్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హనుమంతరావు, రంజిత్‌, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యంతో చదవాలి
1
1/2

ఉన్నత లక్ష్యంతో చదవాలి

ఉన్నత లక్ష్యంతో చదవాలి
2
2/2

ఉన్నత లక్ష్యంతో చదవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement