రారండోయ్‌.. సర్కారు బడికి | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌.. సర్కారు బడికి

Jun 8 2025 12:58 AM | Updated on Jun 8 2025 12:58 AM

రారండ

రారండోయ్‌.. సర్కారు బడికి

ఊరూరా జయశంకర్‌ బడిబాట ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం

వినూత్న తరహాలో ఆకర్షించే కార్యక్రమాలు పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపు

ఇంగ్లిష్‌ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్‌ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్‌ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్‌..

ఇదే మా ఓపెన్‌ చాలెంజ్‌..

మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్‌ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్‌ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్‌ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.

– వివరాలు 10లోu

రారండోయ్‌.. సర్కారు బడికి1
1/4

రారండోయ్‌.. సర్కారు బడికి

రారండోయ్‌.. సర్కారు బడికి2
2/4

రారండోయ్‌.. సర్కారు బడికి

రారండోయ్‌.. సర్కారు బడికి3
3/4

రారండోయ్‌.. సర్కారు బడికి

రారండోయ్‌.. సర్కారు బడికి4
4/4

రారండోయ్‌.. సర్కారు బడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement