కేబినెట్‌లోకి ఎవరో? | - | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లోకి ఎవరో?

Jun 8 2025 12:38 AM | Updated on Jun 8 2025 12:38 AM

కేబిన

కేబినెట్‌లోకి ఎవరో?

● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కేబినెట్‌ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్‌, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్‌లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికై న నేతలు, సీనియర్‌ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్‌ నుంచి కేబినెట్‌లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్‌ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది.

కేబినెట్‌లోకి ఎవరో?1
1/2

కేబినెట్‌లోకి ఎవరో?

కేబినెట్‌లోకి ఎవరో?2
2/2

కేబినెట్‌లోకి ఎవరో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement