Russia-Ukraine War: భారత్‌ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రష్యా..

Russia Received India Requests For Emergency Evacuation Of Nationals - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడుల నేపథ్యంలో రష్యాపై ఇప్పటికే ఈయూ, పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంపై భారత్‌ తీసుకున్న తటస్థ వైఖరిని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ ప్రశంసించారు. ఈ సంక్షోభాన్ని భారత్‌ లోతుగా అర్థం చేసుకున్నదని కితాబిచ్చారు. 

కాగా, బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం ఖార్కివ్‌లో భారత విద్యార్థి నవీన్‌ మరణానికి ఆయన సంతాపం తెలిపారు. దీనిపై రష్యా స్పందించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం నేపథ్యంలో భారతీయులందరికీ భద్రత కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఖార్కివ్‌, తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం తాము అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా అత్యవసరంగా తరలించాలన్న ఇండియా అభ్యర్థనను తాము స్వీకరిస్తున్నట్టు చెప్పారు. 

మరోవైపు.. భారత్‌తో రష్యా వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో అంతకు ముందు చేసుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరాకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. ఒప్పందాలు కొత్తవైనా, పాతవైనా ఎటువంటి ఆంక్షలు లేవని వెల్లడించారు. 

(ఇది చదవండి: ప్రాణాన్ని లెక్కచేయని ఉక్రెయిన్‌ పౌరుడు.. వీడియో చూస్తే షాక్‌ అవాల్సిందే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top