లాటరీలో రూ.1,804 కోట్లు! | Brit Man Wins Massive Rs 1804 Crore In Lottery | Sakshi
Sakshi News home page

లాటరీలో రూ.1,804 కోట్లు!

Nov 28 2024 10:48 AM | Updated on Nov 28 2024 10:57 AM

Brit Man Wins Massive Rs 1804 Crore In Lottery

బ్రిటన్‌లో ఓ వ్యక్తిని వరించిన అదృష్టం

లండన్‌: బ్రిటన్‌లో ఓ వ్యక్తికి అదృష్టం మామూలుగా కలిసిరాలేదు! ఏకంగా 17.7 కోట్ల పౌండ్ల (రూ.1,804 కోట్ల) లాటరీ తగిలింది. ఆ దేశ చరిత్రలోనే మూడో అతి పెద్ద లాటరీ మొత్తంగా నిలిచింది. మంగళవారం జరిగిన యూరోమిలియన్స్‌ లాటరీ డ్రాలో మనవాడు ఈ జాక్‌పాట్‌ కొట్టాడు. 

సదరు అదృష్టవంతుని వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. 2022లో ఓ అజ్ఞాత వ్యక్తి గెలుచుకున్న 19.5 కోట్ల పౌండ్లు బ్రిటన్‌లో ఇప్పటిదాకా అత్యంత భారీ జాక్‌పాట్‌గా నిలిచింది. గత మేలో గ్లోసిస్టర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు గెలిచిన 18.4 కోట్ల పౌండ్లకు రెండో స్థానం దక్కింది.  

Advertisement
 
Advertisement
Advertisement