అనంత్‌ రాధిక సంగీత్‌ కార్యక్రమంలో నీతా లుక్‌ అదుర్స్‌..చేతికి హృదయాకారంలో..! | Isha Ambani Lends Mum Nita Ambani Her Giant Heart Shaped Diamond Ring | Sakshi
Sakshi News home page

అనంత్‌ రాధిక సంగీత్‌ కార్యక్రమంలో నీతా లుక్‌ అదుర్స్‌..చేతికి హృదయాకారంలో..!

Jul 7 2024 2:17 PM | Updated on Jul 7 2024 3:00 PM

Isha Ambani Lends Mum Nita Ambani Her Giant Heart Shaped Diamond Ring

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి వేడుక ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ఆ అంబానీ కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాలు వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. జూలై 12న అనంత-రాధికల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు జరిగే సంగీత్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 

ఆ కార్యక్రమంలో నీతా రాణి పింక్‌ లెహంగా చోళీలో అద్భుతంగా కనిపించారు. ఆ డిజైనర్‌ లెహంగాకి తగ్గట్లు ఆమె ఎంచుకున్న కాంతీలాల్‌ ఛోటాలాల​ రూపొందిచిన వజ్రాభరణాలు మరింత అందాన్ని తెచ్చిపెటట్టాయి ఆమెకు. అలాగే చేతులకు డైమండ్‌ బ్యాంగిల్స్‌ ​ధరించింది. ఈ అలంకరణలో అందరి దృష్టి ఆమె ధరించిన హృదయకారపు ఉంగరంపైనే పడింది. ఇదే ఉంగరాన్ని ఆమె కూతురు ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌లో ధరించింది. ప్రస్తుతం ఈ తల్లి, కూతుళ్ల ద్వయం సేమ్‌ రింగ్‌ని ధరించడం నెట్టింట కాస్త హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో నీతా ధరించిన ఆభరణాలు చాలా హైలెట్‌గా నిలిచాయి.

నీతా ధరించిన ఆభరణాలు..
కాంతిలాల్‌ ఛోటాలాల్‌ రూపొందించిన ఆభరణాలు నీతా కంఠానికి ఎగ్జాట్‌గా సరిపోయాయి. రోజ్‌ కట్‌ డైమండ్లు ఆమె మెడను మిరమిట్లుగొలిపే కాంతితో నింపాయి. ఆమె తలకు ధరించిన పాపిడి బొట్టు, చెవిపోగులు.. ప్రతీదీ కళాత్మకంగా ఉంది.

 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!)

 

Advertisement
 
Advertisement
Advertisement