ఎన్ని అలలు ఎగిసినా... 

Sakshi Editorial On Upcoming Corona Third Wave In India

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుదల ఆశావహ పరిస్థితులు కల్పిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ వాతావరణం నెలకొంటోంది. కొన్ని వారాలుగా దాదాపు అన్ని రాష్ట్రాలూ కఠిన ఆంక్షలు విధించి, అమలుపరచిన కట్టడి ఫలితమే ఇది! కోవిడ్‌–19 రెండో అల ఉదృతంగా వచ్చి, ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగటం, మరణాల రేటు అధికమవడం, నెల కింద దేశాన్ని కుదిపేసింది. స్థానిక పరిస్థితుల్ని బట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచన చేసింది. ఆ మేర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి ప్రకటించి, అవసరమైన నిర్ణయాలతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టాయి. అందుకు తగ్గట్టుగానే ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగించింది. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు..మన దేశంలో కోవిడ్‌ మూడో అల గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో కేసులు రమారమి తగ్గుతున్న తాజా పరిణామం ఆశాజనకమే! పలు రాష్ట్రాల్లో కట్టడి వివిధ స్థాయిల్లో, వేర్వేరు నమూనాల్లో ప్రస్తుతం అమలౌతోంది. కొన్ని చోట్ల సమయ పరిమితులుంటే, మరి కొన్ని చోట్ల పలు అంశాలపైన, వ్యవస్థలపైన ఈ కట్టడి పాక్షికంగానో, పూర్తిగానో కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గుతున్న పరిస్థితుల్లో కట్టడి ఉపసంహరణ ఎలా చేస్తారు? ఏ అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? తదనంతరం ఏయే జాగ్రత్తలు పాటిస్తారన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. దశల వారీ ఉపసంహరణ ప్రక్రియ అక్కడక్కడ మొదలవుతోంది. అత్యధిక కేసులు నమోదై తీవ్ర కలవరపాటుకు గురి చేసిన దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇటీవల కేసులు బాగా తగ్గిపోయాయి. ఆయా ప్రభుత్వాలు పాక్షిక ఉపసంహరణను ప్రకటించాయి. ఇవాల్టి నుంచి సదరు సడలింపులు అమల్లోకి వస్తున్నాయి. తమిళనాడు తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి  మెరుగవుతోంది. తాజా పరిస్థితిని మదింపు చేసి, తదుపరి నిర్ణయం వెల్లడించనున్నట్టు ఆయా ప్రభుత్వాలు సంకేతాలిచ్చాయి. పరిస్థితులు అదుపులోకి రాని తమిళనాడు, మేఘాలయ వంటి రాష్ట్రాలు కట్టడి పొడిగించాయి.

           పెద్ద జనాభా దేశంగా లెక్కించినపుడు, తాజా పరిస్థితి... రెండో అల బలహీనపడుతున్న సంకేతమే! ప్రభావవంత పునరుత్పత్తి రేటు 0.68కి పడిపోయింది. పరీక్షలు జరిపిన వారిలో వైరస్‌ సోకిన వారి సంఖ్య తగ్గుతోంది. వారపు సగటు 7 శాతంగా నమోదయినా, రోజువారీ రేటు 5 శాతానికి తగ్గింది. కిందటి వారపు సగటు (10 శాతం)తో పోల్చి చూస్తే కేసుల సంఖ్య తగ్గుముఖంలో ఉన్నట్టు స్పష్టమౌతోంది. అదే సమయం, దేశంలో మొత్తంగా రోజువారీ కేసుల సంఖ్య 1.30 లక్షల వరకుండటం, మరణాలు 2500 నుంచి 3000 వరకు నమోదవడం చూస్తే, మహమ్మారిని నిలువరించామని చెప్పలేని పరిస్థితి. ప్రపంచంలో ఇప్పుడిదే అత్యధికం! మన తర్వాత బ్రెజిల్‌ (64వేలు), అర్జెంటీనా (30వేలు)ల్లో రోజువారీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు పరీక్షల సంఖ్య పెరుగుతూ మరో వైపు పాజిటివిటీ రేటు తగ్గితే అది శుభ పరిణామం! ప్రస్తుతం దేశంలో ఒకరోజు 20.84 లక్షల పరీక్షలు జరుపగా టీపీఆర్‌ 4.8 శాతంగా నమోదైంది. కిందటి వారపు రేటు (9.8 శాతం)లో ఇది సగం. రాష్ట్రాల్లో కట్టడి ఆంక్షలు సడలించడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) కొన్ని మార్గదర్శకాల్ని సూచించింది. టీపీఆర్‌ 5 శాతం కన్నా తగ్గడం, ప్రాధాన్య వర్గాల్లో 70 శాతం మందికి టీకాలు ఇచ్చి వుండటం, కోవిడ్‌ సముచిత ప్రవర్తన (సీఏబీ)కి పౌరసమాజాలు ముందుకు రావడం... ఉన్న జిల్లాల్లో కట్టడిని సడలించ వచ్చన్నది వాటి అంతరార్థం!

         దేశంలో బాగా ప్రభావం చూపిన ఆల్ఫా (బి.1.1.7), డెల్టా (బి.1.617.2), ఈ రెండు కరోనా వైవిధ్య వైరస్‌లే రెండో అల ఉధృతికి కారణాలు. ‘ఈ రెండు వైవిధ్యాలే కడపటివి కావు, ఇప్పుడున్న రెండో అలే చివరిది కాదు!’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నిరోధంలో ఆంక్షలతో కూడిన కట్టడి మంచి ఫలితమిచ్చిన మాట వాస్తవమే! అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమూ పడింది. మనిషి మనుగడకు ‘ప్రాణం–ప్రాణాధారం’ రెండూ ముఖ్యమే! ప్రాణాలు కాపాడే క్రమంలో.. ప్రాణాధారమైన ఉద్యోగ, ఉపాధి పనులపై దెబ్బపడి, ఉత్పత్తి, వ్యాపార–వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవడం మంచిది కాదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, వైరస్‌ కట్టడి ద్వారా అటు ప్రజల ప్రాణాల్ని కాపాడాలి. కట్టడిని సడలించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించి సమాజ మనుగడనూ కాపాడాలి. వాటి మధ్య సమతూకం సాధించాలి. అవసరమైన పటిష్ట ప్రజా వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలి. వైరస్‌ ఏ వైవిధ్య రూపంలో వచ్చినా, మరే అల ఉధృతితో తోసుకువచ్చినా సమర్థంగా ఎదుర్కోగల స్థితి తీసుకురావాలి. తగిన సంఖ్యలో పరీక్షలు, పాజిటివిటీ అదుపు, మరణాల నియంత్రణ, కోలుకుంటున్న వారి సంఖ్య వృద్ధి సాధించాలి. వారంపై వారం పరిశీలన చేస్తూ, ఎపిడమాలజీ పరంగా, జీనోమ్‌ పరంగా పరిశోధనలు జరిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏది మూడో అలనో రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి. ఈ క్రమంలో చేపట్టే చర్యలకు పౌరసమాజం నిర్మాణాత్మక సహకారం అందించాలి. అప్పుడే, ఈ విపత్తు నుంచి అందరం బయటపడుతాం.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-06-2021
Jun 06, 2021, 21:03 IST
కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌.. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి శివశంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ...
06-06-2021
Jun 06, 2021, 20:08 IST
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. తగ 24 గంటల్లో 97,751 మందికి కరోనా పరీక్షలు చేయగా.....
06-06-2021
Jun 06, 2021, 18:35 IST
సాక్షి,చిత్తూరు: తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో...
06-06-2021
Jun 06, 2021, 17:19 IST
గురుగ్రామ్‌: డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద గురువు , డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కరోనా...
06-06-2021
Jun 06, 2021, 17:02 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 381 కొత్త కరోనా...
06-06-2021
Jun 06, 2021, 16:58 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90...
06-06-2021
Jun 06, 2021, 16:44 IST
ఇంఫాల్‌: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్‌ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్‌ వర్కర్లపై...
06-06-2021
Jun 06, 2021, 15:01 IST
లక్నో: కరోనా ఉధృతి కారణంగా అనేక రాష్ట్రాలలో లాక్​డౌన్​ విధించి, కఠిన నిబంధలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ...
06-06-2021
Jun 06, 2021, 09:08 IST
ఆడవారు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పొద్దున నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్లు, అందులో...
06-06-2021
Jun 06, 2021, 06:23 IST
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల...
06-06-2021
Jun 06, 2021, 06:13 IST
హైదరాబాద్‌: భారత్‌లో అత్యంత చవకైన కోవిడ్‌–19 వ్యాక్సిన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌–ఇ ఫార్మా కంపెనీ అందించనుంది. ఈ సంస్థ ఉత్పత్తి...
06-06-2021
Jun 06, 2021, 06:05 IST
సాక్షి, అమరావతి: వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ గ్లోబల్‌ టెండర్‌కు వెళ్లింది. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల...
06-06-2021
Jun 06, 2021, 06:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్రమణ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పాజిటివ్‌ కేసుల నమోదులో రోజురోజుకూ తగ్గుదల...
06-06-2021
Jun 06, 2021, 05:57 IST
సాక్షి, అమరావతి: కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డా.ఎన్‌.భాస్కరరావు వైద్యానికి అయ్యే...
06-06-2021
Jun 06, 2021, 05:42 IST
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ అయిన సుమారు 200 కోట్ల కోవిడ్‌ టీకా డోసుల్లో భారత్, అమెరికా, చైనాల...
06-06-2021
Jun 06, 2021, 05:35 IST
‘వైద్యులు, వైద్య సిబ్బంది విపత్తు సమయంలో చేస్తున్న సేవలను ఈ ప్రభుత్వం మరచిపోదు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలందిస్తున్న...
06-06-2021
Jun 06, 2021, 05:07 IST
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో...
06-06-2021
Jun 06, 2021, 04:54 IST
ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ...
06-06-2021
Jun 06, 2021, 04:32 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విధుల్లో మరణించిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైద్య,ఆరోగ్యశాఖలోని 24 సంఘాల...
06-06-2021
Jun 06, 2021, 03:52 IST
సాక్షి, అమరావతి:  కరోనా మూడవ వేవ్‌ గురించి పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకోని 45 ఏళ్లలోపు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top