
ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
వంట నూనెల కొరత దృష్ట్యా ఆయిల్‌పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కనీస ప్రోత్సాహక ధరగా రూ.25 వేలు చెల్లించాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్‌పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. వైట్ ఫ్లై (తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు. నూనె శాతాన్ని నిర్ణయించే పెదవేగి ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదు.
– పెండ్యాల బుజ్జిబాబు, తూర్పు గోదావరి జిల్లా
ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, రంగంపేట