
అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్
కాకినాడ రూరల్: రూరల్ మండలం వాకలపూడి గ్రామ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్న అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలుపై శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలశాఖ అధికారుల పర్యవేక్షణలో సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరావు, ఇన్‌స్పెక్టర్ రాంబాబు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.