వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ నియామకం

Jul 5 2025 6:48 AM | Updated on Jul 5 2025 6:48 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ నియామకం

వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ నియామకం

అమలాపురం టౌన్‌: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కమిటీలో పలువురిని కేంద్ర కార్యాలయం నియమించింది. కమిటీ ఉపాధ్యక్షులుగా కుడుపూడి విద్యాసాగర్‌ (బుజ్జి) (పి.గన్నవరం నియోజకవర్గం), కొయ్య బంగారుబాబు (రామచంద్రపురం), దూలం వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు) (మండపేట), నాతి సత్యనారాయణ (ముమ్మిడివరం), గుత్తుల వాసు (కొత్తపేట), కూనపరెడ్డి ఎస్‌ఆర్‌వి ప్రసాద్‌ (రాజోలు). సుభాష్‌ చంద్రబోస్‌ (అమలాపురం), ప్రధాన కార్యదర్శులుగా పెట్టా శ్రీనివాసరావు (రామచంద్రపురం), వెలగల సత్యనారాయణ (మండపేట), వాత్సవాయి కృష్ణంరాజు (కొత్తపేట), రాయపురెడ్డి జానకి రామయ్య (ముమ్మిడివరం), ఈద రవిరెడ్డి (రాజోలు), కోశాధికారిగా కాలెపు నాగ శ్రీనివాసరావు (అమలాపురం), సెక్రటరీ ఆర్గనైజేషనల్‌గా పి.గన్నవరానికి చెందిన కొంబత్తుల ఏసుబాబు, వాసంశెట్టి నాగ భూషణం (పెదబాబు), నంబూరి శ్రీరామచంద్రరాజు, రామచంద్రపురానికి చెందిన చిట్టూరి శ్రీనివాసరావు, మాత నూకారావు, మండపేటకు చెందిన పలివెల మధు, కొప్పిరెడ్డి వెంకట శివ ప్రసాద్‌, ముమ్మిడివరానికి చెందిన సక్కెలి వెంకటేశ్వర్లు, అంకాడి అంజిబాబు, కొత్తపేట నుంచి బండారు దొరబాబు, నంగెడ్డ రంగారావు, దొడ్డారపు వీర వెంకట సుబ్బారావు, మాగాపు విజయకుమార్‌, రాజోలు నుంచి తులా సత్యనారాయణ, కొల్లాటి నరసింహస్వామి. అమలాపురం నుంచి ఆర్‌.నాగేశ్వరరావు, చింతా రామకృష్ణ. బడుగు మేరి, సెక్రటరీ యాక్టివిటీలుగా పి.గన్నవరం నుంచి బొంతు శ్రీనివాసరావు, పిల్లి శ్రీనివాసరావు, రామచంద్రపురం నుంచి చొల్లంగి బాలు ప్రకాష్‌, వెన్నేటి సుందర రామ్‌కుమార్‌, మండపేట నుంచి గుడిమెట్ల శివరామకృష్ణ (రాంబాబు), టేకిమూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం నుంచి కళా వెంకట రమణ, బడుగు శ్రీనివాసరావు, కొత్తపేట నుంచి గొలకోటి సూర్య ప్రకాష్‌, షేక్‌ వల్లీబాబు, వాకలపూడి సుబ్బారావు, దొడపాటి పనసయ్య, రాజోలు నుంచి తాడిచెర్ల మల్లీశ్వరిలను నియమిస్తూ జిల్లా పార్టీ కార్యాలయానికి సమాచారం పంపించింది.

వైద్యులు, విద్యార్థులకు

అండగా వైఎస్సార్‌ సీపీ

అమలాపురం టౌన్‌: గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలనుకుంటే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసి నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ జిల్లెళ్ల రమేష్‌, జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్‌ అన్నారు. స్థానిక పార్టీ విద్యార్థి విభాగం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకో వైద్య కళాశాల నిర్మాణంలో జాప్యం వల్ల వైద్య విద్య చదవాలనుకునే పేద విద్యార్థులు, విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ నిర్వాకం వల్ల అక్కడి మెడికోలు పర్మెనెంట్‌ రిజస్ట్రేషన్‌ సర్టిిఫికెట్లు పొందలేక ఇబ్బంది పడుతున్న వైనంపై వారు ధ్వజమెత్తారు. వైద్య విద్యార్థులు, వైద్యులకు పార్టీ విద్యార్థి విభాగం సంఘీభావం తెలుపుతోందన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపు మేరకు ఈ సమస్యలపై 7వ తేదీన విజయవాడ ఎన్టీఆర్‌ వర్శిటీ వీసీకి వినతి పత్రం అందించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థి విభాగం ప్రతినిధులు బడుగు మోహన్‌, పెట్టా సత్తిబాబు, ముత్యాల జగన్‌, మారే రవితేజ, జల్లి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement