వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
కొత్తపేట: ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అల్లూరి జయంతి పురస్కరించుకుని శుక్రవారం ఆత్రేయపురంలో ఆయన అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అల్లూరి సీతారామరాజు పార్కు, ఆ గ్రామ సెంటర్‌లో సీతారామరాజు విగ్రహాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి నాగిరెడ్డి, ముదునూరి కృష్ణంరాజు, వేగేశ్న గోపాలరాజు, గొట్టుముక్కల గోపి పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరులో అల్లూరి పాత్ర చారిత్రాత్మకం : జిల్లా ఎస్పీ కృష్ణారావు
అమలాపురం టౌన్: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు పోరు సలిపారని, అందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చారిత్రాత్మకమని ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జయంతి సభలో ఎస్పీ మాట్లాడారు. తొలుత మన్యం వీరుడు అల్లూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌బీపీ ప్రసాద్ స్వాతంత్య్ర సమరంలో అల్లూరి పాత్రను వివరించారు. జిల్లా ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాసరావు, సోషల్ మీడియా పర్యవేక్ష సీఐ జి.వెంకటేశ్వరరావు, ఆర్మ్‌డ్ ఆర్‌ఐ బ్రహ్మానందంలతో పాటు ఎస్పీ కార్యాలయ ఎస్సైలు, సిబ్బంది విప్లవ వీరుడు అల్లూరి సేవను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించారు.
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం