
కూటమి వంచనపై ప్రజారణం
మేనిఫెస్టో నూరు శాతం
అమలు ఘనత జగన్‌దే..
దేశంలో ఇప్పటి వరకూ 18 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశంలోనే ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలు నూరు శాతం అమలు చేయలేదు. అలా నూరు శాతం అమలు చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు మేనిఫెస్టోను మోసాలకు, అబద్దాలకు కేరాఫ్ చేశారు.
– పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు
మోసాలకు పెట్టింది పేరు
చంద్రబాబు
చంద్రబాబు అంటేనే మోసాలకు పెట్టింది పేరు. సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఇతర పార్టీలను తోడేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు అలవాటైపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే తన ఆఖరి రాజకీయ మజిలీ అన్నట్టుగా సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలిచ్చి, మరో నాటకానికి తెర తీశారు. ఒంటరిగా పోటీ చేసే జగన్ అంటేనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు వణుకు పుడుతోంది.
– విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్
గ్రామాల్లో ప్రజలకు వివరిద్దాం
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరుతో పార్టీ ఇచ్చిన మార్గదర్శకాలతో ప్రజల్లోకి వెళదాం. ప్రజలకు బాబు, పవన్ కల్యాణ్ చేసిన హామీల మోసాలను వివరిద్దాం. ఇక నుంచి జిల్లా పార్టీకి, పార్టీ శ్రేణులకు ఇదే అజెండా. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపడదాం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో బాబు చేసిన మోసాలపై అవగాహన కల్పిద్దాం. ఇందుకోసం జిల్లాలోని పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, పార్టీ కో–ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమై ఉండాలి.
– చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం టౌన్/అమలాపురం రూరల్: చంద్రబాబు ఏడాది పాలన మోసాలపై వైఎస్సార్ సీపీ జిల్లా శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని.. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’పై పార్టీ నిర్దేశించిన నిరసన ప్రణాళికను క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ఎ–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బొత్స ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత సభా వేదికపై దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బొత్సతో పాటు, పార్టీ జిల్లా ముఖ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారింటీ’పై జిల్లాలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై బొత్స దిశానిర్దేశం చేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాబు ఏడాది పాలనలో హామీలు, మోసాలు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన బాండ్లు తదితర అంశాలను బొత్స జిల్లా పార్టీ కార్యకర్తలకు వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బెదిరించి మాట్లాడుతున్న తీరును ఆయన ఎండగట్టారు. వారి బెదిరింపులు, అదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై జిల్లాలో చేపట్టే నిరసనల షెడ్యూల్‌ను వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఈ నిరసనల పర్యవేక్షణకు ఒక్కో నియోజకవర్గం నుంచి నియమించిన పార్టీ పరిశీలకుల పేర్లను వెల్లడించారు. నిరసన కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా శ్రమించాలని పిలుపునిచ్చారు. బొత్స సత్యనారాయణతో పాటు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి తదితరులు చంద్రబాబు ఇచ్చిన హామీలు, మోసాలు, ఏడాది పాలనలో వంచనలను దుయ్యబట్టారు.
అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, పితాని బాలకృష్ణ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాకా ప్రసన్నకుమార్, అమూడ మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, ప్రచార కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాఽథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, జిన్నూరి వెంకటేశ్వరరావు, వంగా గిరిజాకుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, జానా గణేష్, తోరం గౌతమ్‌రాజా, కటకంశెట్టి ఆదిత్యకుమార్, చీకట్ల కిషోర్, దొమ్మేటి సత్యమోహన్ పాల్గొన్నారు.
ఇప్పుడు కుప్పలుతెప్పలుగా అప్పులు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల పాలవుతోందని తెగ బాధ పడిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతకుమించి అప్పులు చేసి పాలిస్తున్నాడు. అప్పుడు జగన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లలో సంక్షేమ ఫలాలు వేస్తే, ఇప్పుడు చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయకుండానే రాష్ట్రాన్ని అప్పుల్లో కుప్పలుతెప్పలుగా ముంచేశాడు.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
బాబూ ష్యూరిటీలపై నిలదీద్దాం
చంద్రబాబు ఎన్నికల్లో ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ అంటూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి లేదు. 20 లక్షల ఉద్యోగాల మాట గాలికి వదిలేశారు. స్కిల్ డవలప్‌మెంట్ వల్ల యువతకు ఉద్యోగాలు వచ్చాయని అబద్ధం చెబుతూ నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాడు. ఇదే జగన్‌కు, చంద్రబాబు మధ్య ఉన్న తేడా.
– పినిపే విశ్వరూప్, పార్టీ కో–ఆర్డినేటర్,
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం
సెక్షన్–30తో ఇబ్బంది పెట్టాలనుకున్నారు
జిల్లాలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను అడ్డుకునేందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసు జులుంను ఉపయోగించింది. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్‌లో సెక్షన్–30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేసి, సభ జరగకుండా ఇబ్బంది పెట్టాలనుకుంది. అరిచేతి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరనట్టుగా ఈ సభకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు పోలీస్ ఆంక్షలను కాదని తరలివచ్చారు.
– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ
బాబు ఏడాది పాలన మోసాలపై
గ్రామాల్లో వివరించండి
‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’పై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి
నిరసనలపై పార్టీ జిల్లా శ్రేణులకు
రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో
బాబు మోసపూరిత హామీలను
ఎండగట్టిన వైఎస్సార్ సీపీ
జిల్లా విస్తృత స్థాయి సమావేశం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం

కూటమి వంచనపై ప్రజారణం