
ఒలింపిక్ మెడల్ సాధించడమే ధ్యేయం
నేను ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తండ్రి బ్యాంక్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. నా సరదాను చూసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను మా కోచ్ లక్ష్మణరావు దగ్గర చేరి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర కాలంలోనే అన్ని మెళుకువలు నేర్చుకుని కాకినాడ డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అండర్ 19 స్కూల్ గేమ్స్ బాక్సింగ్‌కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యాను. పిఠాపురంలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించాను. విశాఖపట్నంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాను. ఒలింపిక్ మెడల్ సాధించడమే నా ధ్యేయం.
– జే ఐశ్వర్య సూరి దీపిక, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం
●