పారదర్శక ఎన్నికలకు సలహాలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శక ఎన్నికలకు సలహాలు

Mar 22 2025 12:15 AM | Updated on Mar 22 2025 12:15 AM

పారదర్శక ఎన్నికలకు సలహాలు

పారదర్శక ఎన్నికలకు సలహాలు

అమలాపురం రూరల్‌: ఓటరు జాబితా సవరణ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి రాజకీయ పార్టీలు సూచనలు, సలహాలు తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్‌ రాజకుమారి కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాస్థాయి సూచనలు సలహాల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను మరింత పారదర్శకంగా, చేపట్టడానికి తరచూ సలహాలు ఇవ్వాలని ప్రతినిధులను కోరారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి 18 సంవత్సరాల నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని, గ్రామ సచివాలయాల్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఫారం 6, 7, 8 ల క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిష్కరిస్తామన్నారు. టిడ్కో గృహాలలో ఉంటున్న వారికి స్థానికంగానే ఓటు హక్కు ఉందని, వీరి ఓట్లను టిడ్కో ప్రాంతానికి మార్పు చేయాలని ప్రతినిధులు కోరగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, రాజకీయ పార్టీల నాయకులు దూరి రాజేష్‌, చిక్కాల సతీష్‌, వడ్డీ నాగేశ్వరరావు, భవాని, ఉప తహసీల్దార్‌ శివరాజ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సాయిరాం పాల్గొన్నారు.

విద్యా విజ్ఞాన అధ్యయన విహార యాత్ర

కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల విద్యా, విజ్ఞాన, అధ్యయన విహార యాత్ర బస్సులను కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ విహారయాత్ర 23వ తేదీ వరకు 131 మంది 8 ,9 తరగతుల విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులతో సాగుతుందన్నారు. ఈ యాత్రలో విద్యార్థులు తిరుపతిలోని ఐఐటీ తిరుపతి, రీజినల్‌ సైనన్స్‌ సెంటర్‌, తిరుపతి జూలాజికల్‌ గార్డెన్‌, చంద్రగిరికోట వంటి ప్రముఖ విద్యా, శాస్త్ర, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించ నున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలోని కోరింగ అభయారణ్యాన్ని పరిశీలించనున్నారన్నారు. విద్యార్థులకు శాసీ్త్రయ అవగాహన, ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించేలా ఈ యాత్ర రూపొందించామన్నారు. డీఈవో షేక్‌ సలీం బాషా, ఉప విద్యాశాఖ అధికారులు జి.సూర్య ప్రకాశం, సుబ్రహ్మణ్యం, ఎంఈఓలు, జిల్లా సైన్‌న్స్‌ అధికారి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement