
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవలు, కేశఖండన, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.4,01,587 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు.