Kolkata Fire Accident: Major Fire Broke Out At Godown - Sakshi
Sakshi News home page

Kolkata Fire Accident: 12 గంటలైనా మంటలు అదుపులోకి రాలేదు

Mar 13 2022 9:55 AM | Updated on Mar 13 2022 10:33 AM

Major Fire Broke Out At Godown In Kolkata - Sakshi

కోల్‌కతా: నగరంలోని తాంగ్రా ఏరియాలో మెహర్‌ అలీ లేన్‌లో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఓ గోడౌన్‌లో చెలరేగిన మంటలు తీవ్రరూపం దాల్చాయి. మంటలు అదుపుచేయడానికి అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 12 గంటలపాటు మంటలను ఆర్పడానికి యత్నించినా ఇంకా పూర్తిస్థాయిలో వాటిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. 

దాంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దేబ్‌తాను ఘోష్‌ స్పష్టం చేశారు. ‘ 12 గంటల తర్వాత కూడా మంటలను పూర్తిగా ఆర్పలేకపోయాం. దీంతో మంటలను అర్పడానికి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాం. గోడౌన్‌లో ఎక్కువగా మండే లక్షణాలు కల్గిన వస్తువులు ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఫైర్‌ సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుతం 15 మంది ఫైర్‌ ఇంజనీర్స్‌ ఘటనా స్థలి వద్ద ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement