సీసీఆర్‌ఛీ | - | Sakshi
Sakshi News home page

సీసీఆర్‌ఛీ

Jul 3 2025 5:24 AM | Updated on Jul 3 2025 5:24 AM

సీసీఆ

సీసీఆర్‌ఛీ

● కార్డుల జారీలో తీవ్ర జాప్యం ● కౌలు రైతుల కష్టాలు ● జిల్లా వ్యాప్తంగా లక్ష్యం 4,200సీసీఆర్‌ కార్డులు ● జారీ చేసినవి 594 కార్డులు ● రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ● కూటమి ప్రభుత్వ తీరుపై కౌలు రైతుల ఆగ్రహం

పొలం పనుల్లో కౌలు రైతు

గుర్తింపు కార్డులు ఇవ్వాలి

ప్రభుత్వం కౌలు రైతుల ను గుర్తించి వెంటనే అందరికీ సీసీఆర్‌ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. లేని పక్షంలో గతేడాది ఇచ్చిన కార్డులను రెన్యువల్‌ చేయాలి. వ్యవసాయమే ఆధారంగా బతికే కౌలు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

– రమేష్‌, కౌలురైతు, నిండ్ర

మామిడి సాగులో నష్టపోయాం

మామిడి తోటలు కౌలుకు సాగుచేశాం. కాపు కోతకు వచ్చే దశలో గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీల వద్ద టోకెన్లకు తిరిగి తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. దీంతో తోటల్లోనే కాయలు అలాగే వదిలేస్తున్నాం. ఇంకా 50 ట్రాక్టర్ల కాయలున్నాయి. టోకెన్లు త్వరగా ఇప్పిస్తే లాభాలు రాకపోయి నా నష్టాలైనా తగ్గించుకుంటాం. బ్యాంకులో రుణాలు పొందడానికి సీసీఆర్‌ కార్డులు కూడా లేవు. – ధనంజయ

రెడ్డి, కౌలు రైతు, కలికిరిండ్ల, కార్వేటినగరం మండలం

లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తాం

కౌలు రైతులు సీసీఆర్‌ కా ర్డుల కోసం అభ్యర్థనలు చే శారు. కౌలు రైతుల విషయంలో దీనికి ఎంతో ప్రా ధాన్యం ఉంది. గత ఏడాది అందరికీ కార్డులు అందించాం. ఈ ఏడాది కొందరి కి అందజేశాం. త్వరలో ప్రభుత్వం లక్ష్యం మేరకు కౌలుదారులను రైతు సేవా కేంద్రాల ద్వారా గుర్తించి వారికి సాగు హక్కు పత్రాలైన సీసీఆర్‌ కార్డులు అందజేస్తాం. – రాఘవేంద్ర యాదవ్‌,

వ్యవసాయ అధికారి, నగరి మండలం

నగరి : వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పంట సాగు రైతులకు అందించే సీసీఆర్‌ (పంటసాగు హక్కుపత్రం) కార్డుల జారీ నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కౌలు రైతులకు ఈ కార్డులతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని అటకెక్కించింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకూ ఈ పథకం ఊసేలేదు. ఇక పంటల సాగు చేపట్టే రైతులకు ఇచ్చే సీసీఆర్‌ కార్డుల జారీలోనూ జాప్యం నెలకొనడంతో కౌలు రైతులు మండిపడుతున్నారు.

సీసీఆర్‌ కార్డుతో ప్రయోజనాలు

కౌలు రైతులకు ఈ గుర్తింపు కార్డులు ఉంటేనే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లభిస్తుంది. ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల జారీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుండటంతో కౌలు రైతులంతా సీసీఆర్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సీసీఆర్‌ కార్డు తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీసీఆర్‌ కార్డుల జారీ మాత్రం జిల్లాలో సజావుగా సాగకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.

సీసీఆర్‌ఛీ

జిల్లా సమాచారం

జిల్లాలోని పంచాయతీలు : 697

జిల్లాలోని గ్రామాలు : 822

2024లో ఇచ్చిన సీసీఆర్‌ కార్డులు : 4200

2025లో నిర్దేశించిన సీసీఆర్‌ కార్డులు : 4200

ఇప్పటి వరకు ఇచ్చిన కార్డులు : 594

బ్యాంకు రుణాలు అందక

జిల్లా వ్యాప్తంగా గతేడాది 4200 సీసీఆర్‌ కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది కూడా 4200 కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కేవలం 594 కార్డులు మాత్రమే జారీ చే శారు. అంటే రెండున్నర నెలల్లో నిర్దేశించిన లక్ష్యంలో కేవ లం 14 శాతం మాత్రమే సీసీఆర్‌ కార్డులు జారీ చేయడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుర్తించిన మేరకు కౌలు రైతులు అందరికీ ఈ సీసీఆర్‌ కార్డులు జారీ చేయగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాల ఊసే లేదు. దీంతో ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది.

సీసీఆర్‌ఛీ1
1/4

సీసీఆర్‌ఛీ

సీసీఆర్‌ఛీ2
2/4

సీసీఆర్‌ఛీ

సీసీఆర్‌ఛీ3
3/4

సీసీఆర్‌ఛీ

సీసీఆర్‌ఛీ4
4/4

సీసీఆర్‌ఛీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement