మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా | What is Anand Mahindra suggestion for parents getting Mahindra toy tractors | Sakshi
Sakshi News home page

మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా

Dec 12 2021 8:41 PM | Updated on Dec 12 2021 9:31 PM

What is Anand Mahindra suggestion for parents getting Mahindra toy tractors  - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్న తన పోస్టులతో నిత్యం అందరిలో స్ఫూర్తిని నింపుతారు. అంతేకాదు, మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది సూపర్‌ హీరోస్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఇలా తన సోషల్‌ మీడియా పోస్టులతో నెట్టింట్లో సందడి చేసే ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరొక ఫన్నీ వీడియోను పంచుకున్నారు. 

ఈ వీడియోలో ఒక చిన్న కుర్రాడు తన బొమ్మ ట్రాక్టర్‌తో ఒక పెద్ద ట్రాక్టర్‌ను తాడు సహాయంతో కట్టి లాగుతుంటాడు. అయితే, ఈ వీడియోలో ఆ పెద్ద ట్రాక్టర్‌ను తనే లాగుతున్నట్లు పిల్లాడు కనిపించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ, నిజానికి ఆ పిల్లాడి తండ్రి పెద్ద ట్రాక్టర్‌ను ఎంతో జాగ్రత్తగా తోలుతుండడం మనం గమనించవచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్ వేదికగా ఇలా పేర్కొన్నారు.."మీ పిల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మీరు చేసే ఈ పని చాలా బాగుంది. కానీ, ఇతర తల్లిదండ్రులు ఎవరైనా తమ మహీంద్రా ట్రాక్టర్‌తో ఇలా ప్రయత్నించాలనుకుంటే ఈ తల్లిదండ్రులు లాగా చాలా జాగ్రత్తగా ఉండాలని" సూచించారు. ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురుంచి తప్పక తెలుసుకోండి?)

Advertisement
 
Advertisement
Advertisement