పసిడి ప్రియులకు శుభవార్త: మూడో రోజు తగ్గిన గోల్డ్ రేటు | Today Gold and Silver Price February 28th 2025 | Sakshi
Sakshi News home page

పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

Feb 28 2025 10:07 AM | Updated on Feb 28 2025 10:34 AM

Today Gold and Silver Price February 28th 2025

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ.  540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద ఉంది.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement