
కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లను ఊరిస్తూ భారీ లాభాలతో స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన కంపెనీలు ఉన్నట్టుండి ‘బేర్’మంటున్నాయి. ప్రధానంగా టెక్ స్టార్టప్‌లలో ఊపందుకున్న అమ్మకాలు అనూహ్య నష్టాలకు తెరతీస్తున్నాయి. వెరసి కొద్ది వారాల్లోనే కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో వేల కోట్ల సంపద ఆవిరైంది. 2021లో ప్రైమరీ మార్కెట్లు కదంతొక్కాయి. దీంతో పలు స్టార్టప్‌లు సహా వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి.
ప్రధానంగా కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు లిస్టింగ్‌కు పోటీపడ్డాయి. రిటైల్ ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఐటీ, సాస్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్ తదితర కంపెనీలు ఐపీవోల ద్వారా అనూహ్య స్థాయిలో నిధులు సమకూర్చుకున్నాయి. ప్రముఖ ఫిన్‌టెక్ మేజర్ కంపెనీ పేటిఎమ్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయి 728.10 జీవనకాల కనిష్టాన్ని తాకాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ బిఎస్ఈలో రూ.50,000 కోట్ల కంటే దిగువకు పడిపోయింది. కంపెనీ షేరు ఐపీవో ధర రూ. 2,150తో పోలిస్తే రూ.739.20 వరకూ జారింది. అంటే 52.64 శాతం పతనమైంది. ఉక్రెయిన్ రష్యా మధ్య సంఘర్షణ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి సూచీలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు బొరుమంటున్నారు. అయితే, ధీర్ఘకాలంలో షేర్ ధర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.
(చదవండి: అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!)