బెస్ట్‌ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌.. వరెస్ట్‌గా మోస్ట్‌ పాపులర్‌ యూజింగ్‌ సైట్‌/యాప్‌

Meta Company is the worst company of 2021 according Yahoo Survey - Sakshi

2021 Best And Worst Companies Of The Year: ఎప్పటిలాగే ఈ ఏడాది వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే టైంలో ఘోరమైన పతనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌ ట్రేడింగ్‌లో ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి.. ఒమిక్రాన్‌ ప్రభావంతో ఇంకా ఎదురవుతున్నాయి కూడా.  చైనా లాంటి అతిపెద్ద(రెండో) ఆర్థిక వ్యవస్థను.. గ్లోబల్‌ రియల్టి రంగాన్ని కుదిపేసిన ‘ఎవర్‌గ్రాండ్‌’ డిఫాల్ట్‌ పరిణామం ఇదే ఏడాదిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీల పని తీరును, ఇతరత్ర కారణాలను బట్టి జనాల వోటింగ్‌ ద్వారా బెస్ట్‌, వరెస్ట్‌ కంపెనీల లిస్ట్‌ను ప్రకటించింది యాహూ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌.  

2021 ఏడాదిగానూ ప్రపంచంలోకెల్లా చెత్త కంపెనీగా నిలిచింది మెటా (ఇంతకు ముందు ఫేస్‌బుక్‌). ఒపీనియన్‌ పోల్‌లో ఎక్కువ మంద పట్టం కట్టడం ద్వారా ‘వరెస్ట్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌’ గా నిలిచింది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో చైనీస్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా నిలిచింది. అలీబాబా కంటే 50 శాతం అత్యధిక ఓట్లు మెటా దక్కించుకోవడం విశేషం.  ఇక ఇలా ప్రతీ ఏడాది బెస్ట్‌-వరెస్ట్‌ కంపెనీల జాబితాను యాహూ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌ విడుదల చేయడం సహజం. 

యాహూ ఫైనాన్స్‌ హోం పేజీ నుంచి సర్వే మంకీ ద్వారా డిసెంబర్‌ 4, 5 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. వివాదాలు, విమర్శల నేపథ్యంలో.. మెటా కంపెనీకి వరెస్ట్‌ కంపెనీ హోదాను కట్ట బెట్టడం విశేషం. ఇక యూజర్ల అభిప్రాయంలో ఎక్కువగా ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఆరోపణల గురించి కనిపించింది. ఫేస్‌బుక్‌ తీరు, ఇన్‌స్టాగ్రామ్‌ యువత మెంటల్‌ హెల్త్‌ మీద ప్రభావం చూపడం, పిల్లల మీదా చెడు ప్రభావం కారణాలు.. ఫేస్‌బుక్‌ Meta గా మారినా కూడా వరెస్ట్‌ హోదాను కట్టబెట్టాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న పదిలో ముగ్గురు మాత్రమే ఫేస్‌బుక్‌ తన తప్పులు సరిదిద్దుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

 

ఇక యాహూ ఫైనాన్స్‌ లిస్ట్‌లో బెస్ట్‌ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే.. వాటా 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్‌ మైలురాయి దాటడం, మైక్రోసాఫ్ట్‌కి కలిసొచ్చాయి. 
 

చదవండి: చైనీస్‌ ఆపరేషన్‌..  మెటా దర్యాప్తులో సంచలన విషయాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top