బహిరంగ ధూమపానంపై హైకోర్టు ఉక్కుపాదం | Kerala High Court Orders Crackdown on Public Smoking Key Directives | Sakshi
Sakshi News home page

బహిరంగ ధూమపానంపై హైకోర్టు ఉక్కుపాదం

Oct 10 2026 11:42 AM | Updated on Oct 10 2026 12:28 PM

Kerala High Court Orders Crackdown on Public Smoking Key Directives

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని కఠినంగా అదుపు చేయాలని, ధూమపాన నిషేధ నిబంధనలను నూటికి నూరు శాతం అమలు చేయాలని కేరళ హైకోర్టు పోలీసు విభాగాన్ని ఆజ్ఞాపించింది. ప్యాసివ్ స్మోకింగ్ (ఇతరులు తాగే పొగను పీల్చడం) వల్ల అమాయక ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది.

పిటిషన్ నేపథ్యం

ప్రొఫెసర్ మొనమ్మ కొక్కాడ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌ (పిల్‌)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎమ్.లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల పొగతాగని వారు తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉల్లంఘనదారులపై జరిమానాలు పెంచాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల నివేదిక.. ధర్మాసనం ఆదేశాలు

రాష్ట్ర పోలీస్ చీఫ్ దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం, ఇప్పటికే చట్టపరంగా రికవరీ చేసిన జరిమానాలు, తీసుకున్న చర్యలను నమోదు చేసుకుంది. అయితే, కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా చట్టసంబంధిత నిబంధనలను పోలీసు వ్యవస్థ మరింత కఠినంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేసింది. ధూమపాన రహిత వాతావరణం పౌరుల ప్రాథమిక హక్కు అని, ప్రత్యక్ష ధూమపానం ఎంత ప్రమాదకరమో ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంతకుమించి ప్రాణాంతకమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చైతన్యం తెచ్చేందుకు ఆరోగ్య, స్థానిక స్వపరిపాలన, పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రత్యేక అవగాహన డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: భారత్‌కు ‘స్టార్‌లింక్’ నిజంగా సంజీవనియా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement