అది కొంటే ఇది ఉచితమట! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్‌ హర్ష్‌ పాఠాలు

Harsh Goenka Advices In Twitter - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీసీ గ్రూప్‌ చైర్మన్‌ హార్ష్‌గోయెంకా దసర పండగ వేళ సరికొత్త పాఠాలు నేర్పారు. ట్విట్టర్‌ వేదికగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారికి, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి హితబోధ చేశారు. అయితే ఆయన వ్యాపారవేత్త కదా అందుకు జ్ఞానాన్ని సైతం బిజినెస్‌ స్టైల్‌లోనే చెప్పారు. 

హర్ష్‌ చేసిన ట్వీట్‌లో మీరు కోపాన్ని కొంటే అసిడిటీ ఉచితంగా వస్తుంది. ఈర్ష్యని కొంటే భయం ఉచితం, ఒత్తిడిని కొంటే బ్లడ్‌ ప్రషర్‌ ఉచితం అంటూ పలు విధాలుగా సెలవిచ్చారు ఈ పారిశ్రామికవేత్త. అంతేకాదు నమ్మకాన్ని కొంటే స్నేహం ఉచితం, ప్రేమని కొనుగోలు చేస్తే సంతోషం ఉచితమంటూ జీవిత సత్యాలను ట్విట్టర్‌లో ఓలకబోశారు.

స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్‌ ట్రెండ్‌పై కూడా ఆసక్తికర వీడియోను ఆయన షేర్‌ చేశారు. ఇప్పుడు కొనసాగుత్ను బుల్‌ ట్రెండ్‌ ముందు ఏదీ నిలవలేదన్నట్టుగా ఆయన షేర్‌ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top