డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో లేఆప్స్? | Dr Reddy Labs May Cut Workforce by 25 Percent | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో లేఆప్స్?

Apr 14 2025 5:34 PM | Updated on Apr 14 2025 5:39 PM

Dr Reddy Labs May Cut Workforce by 25 Percent

ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 25 శాతం ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గుంచుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ లేఆప్స్ కార్యక్రమాన్ని చేపట్టనుందని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన వెలువడలేదు.

కంపెనీలోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు కంపెనీ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేసింది. అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఏడాదికి కోటి రూపాయల జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement