
అదుపు తప్పిన రెండు కార్లు
కారంచేడు : దగ్గుబాడు నుంచి చీరాలకు వస్తున్న కారు నాలుగురోడ్ల సెంటర్ దాటి మామిడి తోట సమీపంలోకిగా రాగానే గాడిలో టైర్లు పడటంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్ ఉన్న పంట కాలువలో పడిపోయింది. బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వీరగంధం రామకృష్ణ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మధ్యాహ్నం పోతినవారిపాలేనికి చెందిన ఎనికపాటి మస్తాన్‌రావు చీరాలకు వెళ్తుండగా పోతినవారిపాలెం గ్రామం దాటిన ఒక కిలోమీటరు దూరంలోనే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీంతో ఆయన కారులోను బెలూన్లు ఓపెన్ అయ్యాయి. ఆయన కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.
పంట కాలువల్లో బోల్తా