ఈ రాశివారికి శుభవార్తలు అందుతాయి.. సమస్యలు తొలగుతాయి

Today Horoscope 30-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.పంచమి ఉ.8.11 వరకు, తదుపరి షష్ఠి తె.5.51 వరకు నక్షత్రం: మూల ఉ.10.30 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.9.00 నుండి 10.32 వరకు, తిరిగి రా.7.27 నుండి 8.55 వరకు, దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.40 వరకు, అమృతఘడియలు: తె.4.23 నుండి 5.42 వరకు (తెల్లవారితే సోమవారం).

సూర్యోదయం        :  6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: అనుకోని ధనవ్యయం. కొన్ని బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.

వృషభం: పనులు ముందుకు సాగవు. ధనవ్యయం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. 

మిథునం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ సత్తా చాటుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి. బంధువుల నుంచి సహాయం.  వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. 

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆలయాల దర్శనాలు.  కీలక సమాచారం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి. 

సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు. 

కన్య: కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

తుల: ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. 

వృశ్చికం: కుటుంబసమస్యలు. వివాదాలు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిభారం. 

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శుభవర్తమానాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధిగమిస్తారు.

మకరం: పనుల్లో అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప  అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. 

కుంభం: చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొత్త్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శనం. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. .

మీనం: కార్యజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం. అదనపు ఆదాయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top