ఈ విషయాల్లో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope 28 10 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: శు.తదియ ప.12.23 వరకు, తదుపరి చవితి నక్షత్రం: అనూరాధ ప.1.18 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.6.34 నుండి 8.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు తదుపరి ప.12.07 నుండి 12.53 వరకు అమృతఘడియలు: రా.3.40 నుండి 5.10 వరకు.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. ధనవ్యయం

వృషభం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.  ఆదాయం సంతృప్తికరం. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు.  ఉద్యోగాల్లో ప్రగతి.

మిథునం: కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. అదనపు ఆదాయం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు. ఉద్యోగాల్లో  అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయండి.
వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

సింహం: ఉద్యోగ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. కార్యజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య: దూరప్రయాణాలు. ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి.  వ్యాపారాల విస్తరణయత్నాలు వాయిదా. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.

తుల: కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: బంధువులతో విరోధాలు.  కొన్ని పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలలో నిరుత్సాహం. 

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు. రాబడి కొంత తగ్గి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధార్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారాలలో  మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో శుభవార్తలు.

కుంభం: ఉద్యోగ,వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతమైన కాలం.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం. సన్నిహితులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top