Horoscope Today: October 27, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి

Oct 27 2022 6:56 AM | Updated on Oct 27 2022 9:45 AM

Today Horoscope 27 10 2022 - Sakshi

వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలు రద్దు కాగలవు. ఆరోగ్యం కొంత ఇబ్బందికలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.విదియ ప.2.04 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: విశాఖ ప.2.19 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: సా.6.09 నుండి 7.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.02 వరకు, అమృత ఘడియలు: రా.3.14 నుండి 4.50 వరకు; రాహుకాలం :  ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం 6.00; సూర్యాస్తమయం 5.29. 

మేషం: అనుకున్న కార్యక్రమాలు సమయానుసారం పూర్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలు రద్దు కాగలవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఇంటాబయటా బాధ్యతలు అధికం. సోదరులతో మాటపట్టింపులు. అత్యవసరంగా ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విందువినోదాలు. భూవివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కన్య: బంధువులతో తగాదాలు. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృశ్చికం: పనుల్లో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

మకరం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం: కుటుంబంలో కొన్ని సమస్యలు. స్నేహితులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో వివాదాలు. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement